Archive for the ‘పర్యాటక ప్రదేశాలు’ Category

యెల్లంపల్లె తిరుమలనాథస్వామి దేవస్థానంలో పుష్పాలంకరణ సేవ

మైదుకూరు : మైదుకూరు మండలం యెల్లంపల్లె సమీపంలో వెలసిన శ్రీ మహాలక్ష్మీ సమేత తిరుమలనాథ స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాల సందర్భంగాఈనెల 17 వతేదీ  సోమవారం శ్రీ మహాలక్ష్మీ సమేత తిరుమలనాథ స్వామి  వారికి పుష్పాలంకరణ సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10-30 గంటల దాకా  అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.,అలాగే అదే రోజు రాత్రి 9 గంటలకు చింతామణి, మయసభ సీన్లతో పాటు సత్యహరిచంద్ర పూర్తి నాటక ప్రదర్శన […]

Share

గుట్టపై గగ్గితిప్పకు ఉత్తర దిశలో తిరుమలనాథ ఆలయం!

వై.ఎస్‌.ఆర్‌. కడప జిల్లా మైదుకూరు మండలంలోని యల్లంపల్లె సమీపంలో వెలసిన శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయం చారిత్రక విశిష్టతతో ఆధ్యాత్మిక శోభతో అలరారుతూ భక్తులను విశేషంగా ఆకర్శిస్తూ ఉన్నది. కొండలు, గుట్టలు, చెరువులతో కూడిన పకృతి రమణీయత నడుమ ఎత్తైన ఒక గుట్టపై వెలసిన ఈ ఆలయం మైదుకూరు ప్రాంతానికే కాక జిల్లాలోని ఎన్నో విశిష్టమైన ఆలయాల సరసన నిలిచి, భక్త జనకోటి పారవశ్యంలో మునిగి, ముక్తిని పొందే దివ్యధామంగా వెలుగొందుతుంది.

Share

వైష్ణవుల ‘మధ్య ఆహోబిలం’… శైవుల ‘మధ్య కైలాసం’

మైదుకూరు: ఆది శంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం, విద్యారణ్యస్వామి ప్రతిష్ఠించిన శ్రీచక్రంతో దర్శనీయ క్షేత్రంగా విరాజిల్లుతున్న పుష్పగిరి క్షేత్రం కడప నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రాన్ని సందర్శించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక, దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో పుష్పగిరి క్షేత్రం కొండపై ఉంది. కింద గ్రామం ఉంది. ఇది హరిహరాదులక్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది..

Share

సంఘ సంస్కర్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ( 1610[1]-1693) 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను భోధించిన యోగి,హేతువాది సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపులు..బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. తీర్థ యాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబల కు కాశీ పట్టణంలో జన్మించి, కర్ణాటక రాష్ట్రం, స్కందగిరి పర్వతసానువులో స్థితమైన పాపాగ్ని మఠ (ప్రస్తుతం ఇది చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని కళవారహళ్లిలో ఉన్నది)అధిపతులు

Share

గోవింద నామస్మరణతో మారుమోగుతున్న బ్రహ్మంగారిమఠం

బ్రహ్మంగారిమఠం: కలియుగ కాలజ్ఞాని జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహేంద్రస్వాముల వారి ఆరాధన గురుపూజ మహోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సోమవారం ఉదయం శ్రీవీర బ్రహ్మ సుప్రభాతం, నామసంకీర్తనం, అభిషేకంతో పాటు స్వామి వారి ఉత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా వేలాది మంది భక్తుల మద్య వీనుల విందుగా స్వామి వారి ఉత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవాలకు తరలి వస్తున్న భక్తాదులు

Share

తోట్లపల్లెలో బ్రహ్మంగారి 32 అడుగుల విగ్రహం ఆవిష్కరణ

బ్రహ్మంగారిమఠం: శ్రీమద్విరాట్‌ పోతూలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అవతార విశేషం అనన్య సామాన్యం. వారి భోధనలు సర్వులకు ఆమోద యోగ్యం. వారి ఆచరణ మనకు మార్గోపదేశం. స్వామి వారి విభవము మధురాతి మధురం వారి ప్రతి మాట , ప్రతి చర్య మనకు శిరోధార్యం అంటూ అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ యోగి అచలానంద గురుదేవులు భక్తులకు ఉపదేశించారు.  మండలంలోని తోట్లపల్లె గ్రామంలో స్వస్తిశ్రీ చంద్రమాన..

Share

మైదుకూరు ప్రాంతంలో వనిపెంట గ్రామానికి విశిష్టమైన చరిత్ర !

ఛోళ  మహారాజు పరిపాలనా కాలంలో నర్రగొల్లలు ఆవుల మందలను మేపుకుంటూ నల్లమల అరణ్యంలో కొట్టాలు వేసుకుని జీవిస్తూ ఉండేవారు. వారి నివాసస్తలంలో ఆవులఎరువు కొండ గుట్టలవలె ఉండేది. ఆ ఎరువును రైతులు ‘ వనం పెంట ‘ గా పొలాలకు వినియోగించేవారు. వనంపెంట దొరికే చోటే క్రమంగా “వనిపెంట” గా మారింది. ఆ గొల్లలు నివశించే ప్రదేశానికి మరికొందరు వచ్చి, ఆ గొల్లవారితో పనులు చేయించుకుంటూ, వనిపెంటకు తూర్పు భాగంలో వజ్రాల కోసం..

Share

శతృవుల ఫిరంగుల ధాటికి ధ్వంసమైన పేరనిపాడు కోట!

సంబెట వంశీయుల పాలనలో ఉండిన పేరనిపాడు కోట శతృవుల ఫిరంగుల ధాటికి ధ్వంసమైన చారిత్రాత్మక సన్నివేశం ఎంతో ఆసక్తి కరమైనది. మైదుకూరు సమీపంలోని యెల్లంపల్లె-చిన్నయ్యగారిపల్లె గ్రామాల మధ్య పేరనిపాడు కోట ఉండేది. పేరనిపాడు కోటకు సంబంధించిన చరిత్ర ఇది. మైదుకూరుకు తూర్పు వైపున 4 కి.మీ దూరంలో  ఉన్న ముక్కొండ ప్రాంతంలో క్రీ.శ. 1420 ప్రాంతంలో పేరయ్య, లోకయ్య అనే యాదవులు గొర్రెలు మేపుకుని జీవించేవారు..

Share

లంకమల అటవీ ప్రాంతంలో అరుదైన కలివికోడి !

సుమారు వందేళ్ళ క్రితమే అంతరించిపోయిందని భావించిన కలివికోడి ఇరవై ఏళ్ళ కిందట 1986వసంవత్సరంలో మనదేశంలోని తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల, శేషాచలం పర్వతపంక్తులలోని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో  సిద్దవటం-బద్వేలు మధ్య అటవీ ప్రాంతంలో ప్రత్యక్షమై పక్షిశాస్త్ర వేత్తలనూ, ప్రకృతి ప్రేమికులనూ ఆశ్చర్యానికి గురిచేసింది.  కలివికోడి రక్షణకు గత ఇరవై ఏళ్ళగా పలుచర్యలను తీసుకుంటున్నారు. ..

Share

నల్లమల అటవీప్రాంతంలో వెలసిన (భైరేని)భైరవకోన!

మైదుకూరు పట్టణానికి ౩౦ కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతం లో వెలసిన భైరవకోన  భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతి ఏట శివరాత్రి సందర్భంగా భైరవకోన తిరుణాల వైభవోపేతంగా జరుగుతుంది. ఈ భైరవకోన చరిత్ర ఇలా ఉంది . పూర్వం అహోబిలం సమీపం లో నల్లమల లో ప్రవహించే భవనాశి నది జలప్రళయానికి సూచనగా ఉప్పొంగడం మొదలయ్యింది. దీనితో అహోబిల నరసింహ స్వామి ఈ జలప్రళయాన్ని ..

Share
Designed by Tavva Communications | Honorary Editor: Obula Reddy | Thanks to Kadapa.info, Chennapatnam.com and Vaidyam