Archive for the ‘చరిత్ర’ Category

చింతకుంట శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవళం

మైదుకూరు:కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట లోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం ఎంతో ప్రాచీనమైనది. చింతకుంట గ్రామ శివార్ల లోని చెరువు , గ్రామంలో శిధిలావస్థలో ఉన్న శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం చింతకుంట గ్రామ పురాతన  చరిత్రకు, గతంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక  వైభవానికి  తార్కాణంగా నిలుస్తున్నాయి.

Share

యల్లంపల్లె శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయ చరిత్ర!

మైదుకూరు : వై.ఎస్‌.ఆర్‌. కడప జిల్లా మైదుకూరు మండలంలోని యల్లంపల్లె సమీపంలో వెలసిన శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయం చారిత్రక విశిష్టతతో ఆధ్యాత్మిక శోభతో అలరారుతూ భక్తులను విశేషంగా ఆకర్శిస్తూ ఉన్నది. కొండలు, గుట్టలు, చెరువులతో కూడిన ప్రకృతి రమణీయత నడుమ ఒక గుట్టపై వెలసిన ఈ ఆలయం మైదుకూరు ప్రాంతానికే కాక జిల్లాలోని ఎన్నో విశిష్టమైన ఆలయాల సరసన నిలుస్తుంది. శ్రీదేవి, భూదేవి సమేతంగా అలరారుతోన్న ఈ క్షేత్రానికి ఎంతో సుదీర్ఘమైన చరిత్ర ఉంది.

Share

తిరుమలనాథ దేవస్థానంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి

మైదుకూరు : మైదుకూరు మండలం యెల్లంపల్లె సమీపంలో వెలసిన శ్రీ మహాలక్ష్మీ సమేత తిరుమలనాథ స్వామి దేవస్థానంలో ముక్కోటి  ఏకాదశి , ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ సమేత తిరుమలనాథ స్వామి  వారికి పుష్పాలంకరణ సేవ , ప్రత్యేక పూజా  కార్యక్రమాలను  ఘనంగా నిర్వహించారు . భక్తులకు తీర్థప్రసాదాలను, నూతన సంవత్సర క్యాలెండర్ లను పంపిణీ చేసారు. ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడంతో మైదుకూరు పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు […]

Share

ఆదిమానవుడి ఆవాసమే దివిటీలమల్లు డెన్

ranibayi_painting

మైదుకురు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలం భూమాయపల్లెలో యాదవ కుటుంబంలో పుట్టి రేకలకుంటలో ఒక పాలెగాని కుటుంబంలో పెరిగి , బ్రిటీషువారినే ఎదిరించి,అత్యంతసాహసవంతుడిగా పేరుగాంచిన దివిటీలమల్లుకు ఆదిమానవుడి కి అవాసమైన ఒక కొండపేటులో తలదాచుకున్నట్లు వెల్లడైంది. కడపలోని యోగివేమన యూనివర్శిటీ చరిత్ర విభాగం పరిశోధనలో తాజగా ఈవిషయం వెలుగులోకి వచ్చింది. ఈ పరిశోధనలో దివిటీలమల్లు సెల గా స్తానిక ప్రజలు భావించే ఈ కొండపేటులో ఆదిమానవులు తలదాచుకునేవారు. బృహత్సిలాయుగం, నవీన శిలాయుగాలలో ఆదిమానవులు యెర్రటి కొండరాళ్ళపై తెల్లటి వర్ణాలతో […]

Share

ఎల్లంపల్లె సమీపంలో పురాతన శాసనాలు, రాతి శిల్పాలు

మైదుకూరు : కడప జిల్లా మైదుకూరు మండలం ఎల్లంపల్లె సమీపంలోని గగ్గితిప్ప వద్ద పురాతన శాసనాలు, రాతి శిల్పాలు బయల్పడ్డాయి. యెల్లంపల్లె గ్రామానికి చెందిన గవిరెడ్డి నాగ ప్రసాద రెడ్డి,మూలే శంకర రెడ్డి పొలాల వద్దగల భైరవుని బావివద్ద ఈ శాసనాలు,శిల్పాలు ఉన్నట్లు తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి,

Share

గుట్టపై గగ్గితిప్పకు ఉత్తర దిశలో తిరుమలనాథ ఆలయం!

వై.ఎస్‌.ఆర్‌. కడప జిల్లా మైదుకూరు మండలంలోని యల్లంపల్లె సమీపంలో వెలసిన శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయం చారిత్రక విశిష్టతతో ఆధ్యాత్మిక శోభతో అలరారుతూ భక్తులను విశేషంగా ఆకర్శిస్తూ ఉన్నది. కొండలు, గుట్టలు, చెరువులతో కూడిన పకృతి రమణీయత నడుమ ఎత్తైన ఒక గుట్టపై వెలసిన ఈ ఆలయం మైదుకూరు ప్రాంతానికే కాక జిల్లాలోని ఎన్నో విశిష్టమైన ఆలయాల సరసన నిలిచి, భక్త జనకోటి పారవశ్యంలో మునిగి, ముక్తిని పొందే దివ్యధామంగా వెలుగొందుతుంది.

Share

సంఘ సంస్కర్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ( 1610[1]-1693) 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను భోధించిన యోగి,హేతువాది సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపులు..బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. తీర్థ యాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబల కు కాశీ పట్టణంలో జన్మించి, కర్ణాటక రాష్ట్రం, స్కందగిరి పర్వతసానువులో స్థితమైన పాపాగ్ని మఠ (ప్రస్తుతం ఇది చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని కళవారహళ్లిలో ఉన్నది)అధిపతులు

Share

బుద్ధుని పాదముద్రికలు స్వాధీనం : మ్యూజియానికి తరలింపు

ఖాజీపేట: ఖాజీపేట మండలం పుల్లూరు, ఆంజనేయకొట్టాలు గ్రామ పరిధిలోని చెరువు వద్ద వెలుగు చూసిన బుద్ధుని పాదముద్రికలను సోమవారం (18.06.2012) పురావస్తుశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడపలోని శ్రీభగవాన్‌ మహావీర్‌ ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాలకు తరలించారు. పురావస్తుశాఖ కడప, చిత్తూరు జిల్లాల అసిస్టెంటు డైరెక్టర్‌ రమణ ఆంజనేయకొట్టాలు గ్రామానికి తన సిబ్బందితో తరలివచ్చి గ్రామ పరిసరాల్లోని బుద్ధుని

Share

కవి చౌడప్ప పుల్లూరు వాసే: బయలుపడ్డ బుద్ధుని పాదముద్రికలు!!

ఖాజీపేట: కడప జిల్లా ఖాజీపేట మండలపరిధిలోని పుల్లూరు చెరువులో, గ్రామ పరిసరాల్లో బుద్ధుడి పాదముద్రికలతో కూడిన శిలావిగ్రహాలు బయటపడ్డాయి. తెలుగు సామాజిక సాంస్కృతిక సాహిత్యాభివృద్ధి సంస్థ గౌరవాధ్యక్షుడు తవ్వా ఓబుల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ధర్మిశెట్టి రమణ శనివారం ఈ శిలావిగ్రహాలను పరిశీలించి విలేకర్లకు వెల్లడించారు. క్రీస్తు పూర్వం 5, 6 శతాబ్దాలలో జీవించిన బుద్ధ భగవానునికి సంబంధించిన అవశేషాలు, కీస్తుశకం

Share

క్రీ.శ.1642 లో నిర్మితమైన నంద్యాలంపేట !

మైదుకూరు: మైదుకూరు మండలం నంద్యాలంపేట గ్రామాన్ని క్రీ.శ.1642 వ సంవత్సరం లో పేరనిపాడు కులకర్ణీగా  పనిచేసిన జంగమయ్య కుమారుడు గురప్పయ్య పౌరాహిత్యంలో ఉరుంపోసి నిర్మించారు. గొల్కొండ నవాబుల ఆధ్వర్యంలో దువ్వూరు ఖిలేదారుడుగా ఉండిన “మహమ్మదు అజేం ” చొరవతో బొమ్మిడ శానంశెట్టి, పాశంశెట్టి ల ముఖాంత్రంగా పేట కొమర్లను, సాలెలను, కంచెర్ల వారిని, మిరాశీదార్లను గ్రామానికి చేర్పించడంతో నంద్యాలంపేట బస్తీగా రూపొందింది. ..

Share
Designed by Tavva Communications | Honorary Editor: Obula Reddy | Thanks to Kadapa.info, Chennapatnam.com and Vaidyam