బ్రహ్మంగారిమఠం: కలియుగ కాలజ్ఞాని జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహేంద్రస్వాముల వారి ఆరాధన గురుపూజ మహోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సోమవారం ఉదయం శ్రీవీర బ్రహ్మ సుప్రభాతం, నామసంకీర్తనం, అభిషేకంతో పాటు స్వామి వారి ఉత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా వేలాది మంది భక్తుల మద్య వీనుల విందుగా స్వామి వారి ఉత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవాలకు తరలి వస్తున్న భక్తాదులు
పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవంగా రథోత్సవాలు
April 27th, 2012
ఎడిటర్ పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీవైద్యనాథ స్వామి, శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామివార్ల రథోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. మొదట శ్రీ వైద్యనాథ స్వామి రథోత్సవం నిర్వహించారు. శ్రీ కామాక్షీ సమేతుడైన వైద్యనాథ స్వామి రథంపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆ సందర్భంగా భక్తులు శివ నామాన్ని స్మరిస్తూ పోటీలు పడి రథాన్ని లాగారు. కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి
సామాజిక రుగ్మతల నిర్మూలనకు కలాలే అస్త్రాలు కావాలి-తెభాస
March 25th, 2012
ఎడిటర్ మైదుకూరు : సమాజంలో చోటు చేసుకుంటున్న సాంస్కృతిక విధ్వంసాలు, సామాజిక రుగ్మతలపై కలాలను అస్త్రాలుగా ప్రయోగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కవులు, కవయిత్రులు, రచయితలు పేర్కొన్నారు. ఉగాది సంద ర్భంగా తెలుగుభాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వ హించిన రచనల పోటీల్లో విజేతలకు ఆదివారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో బహుమతులు ప్రదా నం చేశారు. కథా రచయిత
తెలుగు భాషోద్యమ సమాఖ్య ఉగాది రచనల పోటీ ఫలితాలు!
March 23rd, 2012
ఎడిటర్
శ్రీ నందన నామ ఉగాది పండుగ సందర్భంగా తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ నిర్వహించించిన రచనల పోటీలో విజేతల వివరాలను గురువారం ప్రకటించారు. ఈ నెల 25 వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్తానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. తెలుగు భాషాభిమానులనూ,
వై.ఎస్.ఆర్ జిల్లా స్థాయిలో కవితల,కథల, వ్యాసాల పోటీ!
March 8th, 2012
ఎడిటర్ మైదుకూరు: శ్రీనందన నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని వై.ఎస్.ఆర్ జిల్లా స్థాయిలో కవితల,కథల, వ్యాసాల పోటీని నిర్వహిస్తున్నట్లు తెలుగు భాషోద్యమ సమాఖ్య ప్రతినిధులు తవ్వా ఓబుల్ రెడ్డి , వీరాస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలో పాల్గొనే ఆసక్తి గలవారు ఈ నెల 17 వ తేదీలోగా తమ రచనలను పంపుకోవాలన్నారు.
నేడు మంత్రి డీ ఎల్ రవీంద్రారెడ్డి జిల్లాకు రాక
March 6th, 2012
ఎడిటర్ మైదుకూరు: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రవీంద్రారెడ్డి ఈనెల 7న జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్ అనిల్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి 6న ఉందానగర్ నుంచి రైలులో బయలుదేరి 7న కమలాపురం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఖాజీపేట చేరుకుంటారు. 7 గంటలకు ఖాజీపేట నుండి రోడ్డు మార్గాన బయలుదేరి 7.30కు కడపలో
మైదుకూరులో ఘనంగా మాతృభాషా దినోత్సవం
February 22nd, 2012
ఎడిటర్ మైదుకూరు: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో తెలుగు భాషాభిమానుల సమావేశం ఘనంగా జరిగింది. తెలుగు భాషోద్యమ సమాఖ్య తరపున వకృత్వపోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందచేశారు. సమాఖ్య మైదుకూరు శాఖ అధ్యక్షులు ఏ.వీరాస్వామి, గౌరవసలహాదారులు టి.మహానందప్ప ఆధ్వర్యంలో జరిగిన
‘పబ్లిక్‌హీరో’ ఎడిటర్ వీటీఎస్ ఇక లేరు !
February 22nd, 2012
ఎడిటర్ మైదుకూరు: పబ్లిక్‌హీరో పక్షపత్రిక ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు, వీటీఎస్‌నరసింహాచారి ఆదివారం రాత్రి (20-02-2012)మైదుకూరులో గుండెపోటుతో మృతి చెందారు. 68 ఏళ్ల వీటీఎస్‌నరసింహాచారికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసీకాల్వ వర్క్ ఇన్‌స్పెక్టరుగా పనిచేస్తూ 1965లో రాజీనామా చేశారు. ఎమర్జెన్సీ రోజుల్లో విజయవాడలో ‘విజయవాడ సమాచారం’ పేరుతో పక్షపత్రికను నడిపారు. .
మైదుకూరులో అలరించిన ఘంటసాల సంగీత విభావరి
February 12th, 2012
ఎడిటర్ మైదుకూరు: పద్మశ్రీ ఘంటసాల వర్ధంతి సందర్భంగా మైదుకూరులోని జడ్ పి హైస్కూల్ మైదానంలో శనివారం సాయంత్రం జరిగిన ఘంటసాల సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. కళాకారుడు ఎ. వీరాస్వామి అధ్వర్యంలో అంధ కళాకారుల సేవా సంస్థ “శ్రీ వెంకటేశ్వర సినీ ఆర్కెష్ట్రా” వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం పాటలపోటీని నిర్వహించి విజేతలకు ..
మైదుకూరు మునిసిపాలిటీకి కోటి రూపాయల నిధులు
January 8th, 2012
ఎడిటర్ మైదుకూరు: మైదుకూరు మునిసిపాలిటీని ప్రాథమికంగా అభివృద్ధి చేసేందుకు కోటి రూపాయల నిధులు మంజూరు కానున్నాయని, ఈ నిధులను అత్యవసర అవసరాలకు వినియోగించనున్నట్లు మైదుకూరు మునిసిపాలిటి ఇంచార్జ్ కమీషనర్ జి. వెంకటరావు పత్రికలవారికి తెలిపారు. ప్రొద్దుటూరు మునిసిపల్ కమీషనర్ గా ఉన్న వెంకటరావు మైదుకూరు మునిసిపాలిటి ఇంచార్జ్ కమీషనర్ గా నియమితులయ్యారు. మైదుకూరు గ్రామ
RSS Feed
Twitter



